తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

31-10-2020 Sat 09:27
  • గత 24 గంటల్లో కొత్తగా 1,445 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632
  • మొత్తం 2,18,887 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,336
1445 new corona cases in telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,445 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,486 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,18,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,336 కి చేరింది. ప్రస్తుతం 18,409 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,439 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 286 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 107 కేసులు నిర్ధారణ అయ్యాయి.