Marriage: వివాహం కోసమే మతం మారుతామనడం సరికాదు: అలహాబాద్ హైకోర్టు

  • తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించిన జంట
  • నెల రోజుల క్రితమే హిందూ మతం పుచ్చుకున్న ముస్లిం యువతి
  • 2014 నాటి తీర్పును గుర్తు చేసిన ధర్మాసనం
  • పిటిషన్ కొట్టివేత
Conversion just for marriages sake not acceptable says Allahabad High Court

మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన అలాహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కోసమే మతం మార్చుకోవడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది.

ముస్లిం అయిన యువతి నెల రోజుల క్రితమే హిందూ మతం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకునేందుకే మతం మారినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠీ.. 2014లో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అప్పట్లో ఓ యువతి ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. న్యాయమూర్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం సరైంది కాదని పేర్కొన్నారు. ఆయా మత విశ్వాసాలు, సంప్రదాయల గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మతాలను స్వీకరించడం ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు.

More Telugu News