సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

31-10-2020 Sat 07:16
  • మెగా హీరో సరసన ఐశ్వర్య రాజేశ్ 
  • వచ్చే నెల నుంచి కమల్ కొత్త చిత్రం
  • ఏభై చిత్రాలు పూర్తి చేసిన హన్సిక  
Aishvarya Rajesh to be cast opposite Sai Tej

*  సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయిక మారింది. మొదట్లో ఈ చిత్రానికి నివేద పేతురాజ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే, తాజాగా ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
*  ప్రస్తుతం 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్న విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. కమలహాసన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
*  కథానాయిక హన్సిక తన ఏభయ్యవ చిత్రాన్ని తమిళంలో చేస్తోంది. యూఆర్ జమీల్ దర్శకత్వంలో 'మహా' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ఇటీవల జరిగిన షెడ్యూల్ తో పూర్తయింది. ఇందులో శింబు కీలక పాత్రలో నటించాడు.