చిలుకలు, పావురాలతో సరదాగా నరేంద్ర మోదీ... ఫొటోలు ఇవిగో!

30-10-2020 Fri 22:05
  • గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
  • సొంతరాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన
  • కెవాడియాలో విహంగ ఆవాస కేంద్రం ప్రారంభోత్సవం
PM Modi inaugurates an aviary at Kevadia

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా స్వరాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ కెవాడియాలో ఔషధ మొక్కల పార్కు ఆరోగ్య వన్ ను ప్రారంభించారు. అంతేకాదు, ఓ విహంగ ఆవాస కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం ఆ కేంద్రంలో విహరించారు.

అక్కడ అందమైన పావురాలు, రామచిలుకలను వీక్షిస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. అనేక జాతుల పక్షులను ఆసక్తిగా తిలకించారు. వాటిలో కొన్ని రకాలు చిలుకలు మోదీ చేతిపై వాలాయి. ఈ అనుభూతిని ఆయన చాలా ఆస్వాదించారు. అంతకుముందు ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తూ పంజరంలో ఉన్న పావురాళ్లను బయటికి వదిలారు.