Bandla Ganesh: చాలా కాలం తరువాత రోజాను కలిశాను: బండ్ల గణేశ్

Bandla Ganesh tweets that he has met Roja after a long time
  • ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన రోజా, బండ్ల గణేశ్
  • రోజా కెరీర్ మరింత విజయవంతం కావాలంటూ గణేశ్ ట్వీట్
  • గతంలో ఇరువురి మధ్య మాటలయుద్ధం!

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాను కలిశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి రోజా రావడంతో, అదే ఫంక్షన్ కు వచ్చిన బండ్ల గణేశ్ ఆమెతో ముచ్చటించారు. దీనిపై బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

చాలాకాలం తర్వాత రోజాను కలిశానని తెలిపారు. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు వివరించారు. కాగా, బండ్ల గణేశ్, రోజా మధ్య గతంలో మాటలయుద్ధం నడిచింది. జనసేనాని పవన్ కల్యాణ్ పై రోజా వ్యాఖ్యలు చేయగా, బండ్ల గణేశ్ తీవ్రస్థాయిలో స్పందించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News