ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్... బ్యాట్ విసిరికొట్టిన గేల్

30-10-2020 Fri 21:30
  • దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • 63 బంతుల్లో 99 పరుగులు చేసిన గేల్
  • 6 ఫోర్లు, 8 సిక్సులు కొట్టిన విండీస్ వీరుడు
Angry Gayle throws his bat after he missed ton by a single run

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్ కేవలం 63 బంతుల్లో 99 పరుగులు చేశాడు. మరొక్క పరుగు చేస్తే సెంచరీ పూర్తవుతుందన్న నేపథ్యంలో ఆర్చర్ విసిరిన ఓ ఫుల్ లెంగ్త్ బంతి గేల్ కాలికి తగిలి బెయిల్స్ ను గిరాటేసింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన గేల్ తన బ్యాట్ ను విసిరికొట్టాడు. అయితే, పెవిలియన్ కు వెళుతూ తనను అవుట్ చేసిన ఆర్చర్ తో చేయి కలిపి క్రీడాస్ఫూర్తిని చాటాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గేల్, రాహుల్ (46) చలవతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. చివర్లో నికొలాస్ పూరన్ 10 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు చేశాడు. ఇక, గేల్ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. గేల్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విలవిల్లాడారు. ఈ మెరుపువీరుడు 6 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ ద్వారా గేల్ టీ20 క్రికెట్లో 1000 సిక్సులు పూర్తి చేసుకున్నాడు.