టాలీవుడ్ హిట్ పాటను ఆస్వాదించిన డేవిడ్ వార్నర్

30-10-2020 Fri 21:07
  • ఐపీఎల్ లో హోరాహోరీగా మ్యాచ్ లు
  • మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సివున్న సన్ రైజర్స్
  • బుట్టబొమ్మ పాట వింటూ రిలాక్సయిన వార్నర్
David Warner enjoys Tollywood hit song

ప్రస్తుతం ఐపీఎల్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్క ముంబయి ఇండియన్స్ మినహా మరే జట్టుకు ప్లేఆఫ్ బెర్తు ఖరారు కాకపోవడంతో ప్రతి జట్టు కసిగా ఆడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్ రేసులోనే ఉన్నా, ఆ జట్టు తన చివరి రెండు మ్యాచ్ లను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఎంతో ఒత్తిడి నెలకొని ఉన్న ఈ తరుణంలోనూ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాయిగా రిలాక్స్ అవుతున్నాడు. అందుకు కారణం తెలుగు సినిమా పాటలే.

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ హిట్ సాంగ్స్ కు టిక్ టాక్ వీడియోలు రూపొందించిన వార్నర్ తాజాగా విరామ సమయంలో అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాటను ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.