సోయి లేకుండా ఫాంహౌస్ లో ఉంటే పనులు జరగవు: బండి సంజయ్

30-10-2020 Fri 20:01
  • త్వరలోనే తుంగభద్ర పుష్కరాలు
  • ఏర్పాట్లు చేయడం లేదని సంజయ్ మండిపాటు
  • పుష్కరాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శ
Bandi Sanjay fires on KCR

త్వరలోనే తుంగభద్ర పుష్కరాలు జరగబోతున్నాయి. అయితే ఇంత వరకు పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పుష్కరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని, 5వ శక్తిపీఠంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్ ఏ గుడికి వెళ్లినా వేల కోట్లు, వందల కోట్లు అంటారని... కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరని మండిపడ్డారు. సోయిలేకుండా ఎప్పుడూ ఫాంహౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉంటే పనులు జరగవని విమర్శించారు. మంత్రులకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేల్కొని పుష్కరాల ఏర్పాట్లపై ఆలోచించాలని చెప్పారు.