Farooq Abdullah: మా పోరాటం బీజేపీకి మాత్రమే వ్యతిరేకం.. దేశానికి కాదు: ఒమర్ అబ్దుల్లా

Our fight is against to BJP only says Farooq Abdullah
  • జమ్ముూకశ్మీర్ కు అన్ని హక్కులు కల్పించాలి
  • రాజ్యాంగంలో ఉన్నవాటినే మేము అడుగుతున్నాం
  • మా పోరాటంలో వెనకడుగు వేయం
జమ్మూకశ్మీర్ కు రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సిన అన్ని హక్కులను కల్పించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కొత్తగా తాము ఏదీ డిమాండ్ చేయడం లేదని అన్నారు. రాజ్యాంగంలో ఉన్నవాటినే అడుగుతున్నామని చెప్పారు. తమ హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటాన్ని దేశానికి వ్యతిరేక పోరాటంగా కొందరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేస్తున్న పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమేనని, దేశానికి వ్యతిరేకంగా కాదని అన్నారు. తమ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Farooq Abdullah
NC
Jammu And Kashmir

More Telugu News