TSRTC: హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

TSRTC announces good news for Hyderabadis
  • కరోనా కారణంగా తిరగని బస్సులు
  • ఆ రోజులను కొత్త పాసులో కలుపుతామన్న టీఎస్ఆర్టీసీ
  • కోల్పోయిన రోజులను మళ్లీ వినియోగించుకోవచ్చని ప్రకటన
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను వినిపించింది. కరోనా కారణంగా హైదరాబాద్ సిటీ బస్ పాస్ వినియోగదారులు... ఎన్ని రోజులు బస్ పాస్ ను వినియోగించుకోలేకపోయారో, అన్ని రోజులు మళ్లీ పాస్ ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. బస్ పాస్ వినియోగదారులు అప్పటి బస్ పాస్ ను కౌంటర్ లో అందజేసి కొత్త పాస్ తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు చెప్పారు.

నష్టపోయిన రోజులను కొత్త పాస్ లో కలుపుతామని అన్నారు. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రేటర్ హైదరాబాద్, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్సుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
TSRTC
Bus Pass
Hyderabad

More Telugu News