అజ్ఞాతంలో దీపిక మేనేజర్.. కఠిన చర్యలు తప్పవన్న ఎన్సీబీ!

30-10-2020 Fri 19:03
  • కరిష్మా ఇంట్లో డ్రగ్స్ లభ్యం
  • సమన్లు పంపిన ఎన్సీబీ
  • అప్పటి నుంచి కనిపించకుండాపోయిన కరిష్మా
Deepika Padukone manager absconded

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణతో బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధకపూర్ లను ఎన్సీబీ విచారించింది. మరోవైపు దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు దీపికా పదుకునేకు ఎన్సీబీ సమన్లను జారీ చేసింది. అయితే సమన్లు జారీ చేసినప్పటి నుంచి కరిష్మా ప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

దీనిపై ఎన్సీబీ అధికారులు స్పందిస్తూ విచారణకు హాజరుకాకపోవడం వల్ల కరిష్మా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 23 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేసింది. నెల రోజుల తర్వాత జైలు నుంచి ఆమె బెయిల్ పై విడుదలైంది.