Punarnavi: షాకిచ్చిన పునర్నవి... అది వెబ్ సినిమా నిశ్చితార్థమట!

Punarnavi posted her web film poster that reveals the truth of engagement
  • పునర్నవికి నిశ్చితార్థం అంటూ కథనాలు
  • అంతా వట్టిదే అని తేలిన వైనం
  • ఉద్భవ్ తో ఓ వెబ్ సినిమాలో నటించిన పున్నూ
  • పబ్లిసిటీ కోసమే నిశ్చితార్థం సీన్!

బిగ్ బాస్ ఫేమ్ టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేకాదు, తనకు ప్రపోజ్ చేసింది ఉద్భవ్ రఘునందన్ అని, తాను ఓకే చెప్పానని పోస్టు చేసేసరికి, అందరూ పునర్నవి నిశ్చితార్థం జరిగిందని నిర్ధారించేశారు. అయితే అదంతా ఓ వెబ్ చిత్రం పబ్లిసిటీ కోసమేనని అర్థమవుతోంది.

తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మరింత స్పష్టత వచ్చింది. ఉద్భవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రల్లో నటించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ చిత్రం ఆహా యాప్ లో నవంబరు 13న విడుదల కానుంది.

దీనిపై పునర్నవి స్పందిస్తూ... "తప్పలేక ఒప్పుకున్నా. అసలైన క్రేజీ రైడ్ ఇంకా ముందుంది. మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి. త్వరలోనే కమిట్ మెంటల్ వచ్చేస్తోంది" అంటూ వివరించింది. మొత్తమ్మీద తన వెబ్ ఫిల్మ్ కు పున్నూ ఓ రేంజిలో పబ్లిసిటీ సాధించింది. చూడబోతే ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ కు కూడా పాత్ర ఉన్నట్టు భావించాలి! పునర్నవికి నిశ్చితార్థం, పెళ్లి అనగానే తనవంతు వైరాగ్యపు పోస్టులతో సీన్ ను పండించాడు.

  • Loading...

More Telugu News