Kajal Agarwal: పెళ్లి తర్వాత నో గ్యాప్.. షూటింగుకి వచ్చేస్తానంటున్న కాజల్!

Kajal takes no big break after marriage
  • నేడు ముంబైలో గౌతమ్ తో కాజల్ పెళ్లి 
  • కొవిడ్ నేపథ్యంలో హనీమూన్ కేన్సిల్
  • రెండు నుంచి 'ఆచార్య' తాజా షెడ్యూలు  
  • రెండో వారంలో షూట్ లో జాయినింగ్

వెండితెర మీద కథానాయికగా తన గ్లామర్ వెదజల్లుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కూడా వెలుగొందింది. ఇటీవల కొత్త అమ్మాయిల తాకిడి ఎక్కువవడంతో ఆమె డిమాండ్ కొంతమేర తగ్గింది. ఇదే సమయంలో ఉన్నట్టుండి తన వివాహాన్ని అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని ఈ రోజు ముంబైలో సింపుల్ గా జరిగే వేడుకలో ఆమె పెళ్లాడబోతోంది.

సాధారణంగా ఎవరైనా సరే పెళ్లయ్యాక హనీమూన్ కి వెళ్లి హ్యాపీగా గడపడానికి తమ వృత్తిపని నుంచి బ్రేక్ తీసుకుంటారు. అయితే, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కాజల్ హనీమూన్ ట్రిప్ ఏదీ ప్లాన్ చేసుకోలేదు. దాంతో పెళ్లయ్యాక కొన్ని రోజుల గ్యాప్ లోనే షూటింగుకి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూలును నవంబర్ 2 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ షూటింగులో పాల్గొంటారు. దీంతో నవంబర్ రెండో వారంలో కాజల్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ 'ఆచార్య' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News