కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

30-10-2020 Fri 16:14
  • యూరప్, అమెరికా దేశాల్లో పెరుగుతున్న కేసులు
  • ఫ్రాన్స్ లో మరోసారి లాక్ డౌన్
  • 135 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Markets ends in losses due to fears of Corona second wave

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... సెకండ్ వేవ్ ప్రారంభమైందనే భయాందోళనలు సర్వత్ర నెలకొన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ లో మరోసారి దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించారు. ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 39,614కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 11,642 వద్ద స్థిరపడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.27%), ఎన్టీపీసీ (2.14%), సన్ ఫార్మా (1.97%), నెస్లే ఇండియా (1.53%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.37%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.82%), మారుతి సుజుకి (-2.45%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.32%), బజాజ్ ఫైనాన్స్ (-2.13%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.84%).