Rajiv Kanakala: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రాజీవ్ కనకాల, సుమ కుమారుడు

Rajiv Kanakala and Sumas son to give entry as Hero
  • రోషన్ కనకాల ఎంట్రీకి సర్వం సిద్ధం
  • దర్శకత్వం వహించనున్న విజయ్
  • రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న చిత్రం
ఇప్పటికే ఎందరో నటీనటులు, సినీ ప్రముఖుల వారసులు సినీరంగంలోకి ప్రవేశించారు. వీరిలో కొందరు స్టార్ డమ్ ను సాధించగా, మరి కొందరు విఫలమయ్యారు. తాజాగా మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల కుమారుడు రోషన్ కనకాల.

రాజీవ్ కనకాల దివంగత తల్లిదండ్రులు కూడా ప్రముఖ సినీనటులు అనే విషయం తెలిసిందే. అంతే కాదు యాక్టింగ్ స్కూల్ ను స్థాపించి ఎందరినో నటులుగా తీర్చిదిద్దారు. అలాంటి కుటుంబం నుంచి ఇప్పుడు మూడో తరం సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి రోషన్ ఎంత వరకు తనను తాను ప్రూవ్ చేసుకుంటాడో వేచి చూడాలి.
Rajiv Kanakala
Anchor Suma
Son
Roshan Kanakala
Tollywood

More Telugu News