ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేక తీర్పు వస్తుంది: రఘురామకృష్ణరాజు

30-10-2020 Fri 15:24
  • విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దు
  • కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభించండి
  • జగన్ ఆవేశం తగ్గించుకోవాలి
Supreme court verdict comes against english medium says Raghu Raju

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ఓ వైపు చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం... మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని విన్నవించారు. జగన్ ఆవేశాన్ని తగ్గించుకుని, ఆలోచన పెంచుకోవాలని హితవు పలికారు.

మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామరాజు లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేక తీర్పు రావచ్చని లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని చెప్పారు. ఏ మీడియంలో విద్యాబోధనను ప్రారంభించబోతున్నారో ముందు చెప్పాలని కోరారు.