Narendra Modi: ఔషధ మొక్కల నిలయం 'ఆరోగ్య వన్' ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Arogya Van park in Gujarat
  • గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • రెండ్రోజుల పాటు ప్రధాని పర్యటన
  • మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇవాళ నర్మదా జిల్లాలోని కెవాడియాలో 'ఆరోగ్య వన్' ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆ ఉద్యానవనంలో కలియదిరిగారు. 'ఆరోగ్య వన్' పార్కులో వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఈ మొక్కలు, మూలికల గురించిన పూర్తి సమాచారాన్ని కూడా పార్కులో అందుబాటులో ఉంచారు.

కాగా పార్కులో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు మోదీకి వివరించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్ డౌన్ విధించాక మోదీ గుజరాత్ రావడం ఇదే ప్రథమం. మోదీ తన పర్యటన సందర్భంగా నిన్న మరణించిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు.
Narendra Modi
Arogya Van
Kevadia
Narmada District
Gujarat

More Telugu News