ఇంతకుముందు బిగ్‌బాస్‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

30-10-2020 Fri 12:48
  • ఈ షోకి వ్యాఖ్యాతగా  వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు
  • మామ నాగార్జున వల్లే ఆ షోకి వచ్చాను
  • ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది
  • ఇంతకుముందు ఏ షోకీ వ్యాఖ్యాతగా వ్యవహరించలేదు
samanta about her Experience in big boss

తెలుగులో మంచి ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్‌లో దసరా సందర్భంగా వ్యాఖ్యాతగా అక్కినేని వారి కోడలు సమంత కనపడిన విషయం తెలిసిందే. ‘ఈ రోజు నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’ అంటూ ఆమె పంచిన వినోదం అందరినీ ఆకర్షించింది. తాను యాంకర్ అవతారం ఎత్తిన విషయానికి సంబంధించి సమంత ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఎల్లప్పుడూ గుర్తుండిపోయే మంచి అనుభవం ఎదురైందని సమంత చెప్పింది. ఈ షోకి వ్యాఖ్యాతగా  వ్యవహరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. తన మామ నాగార్జున వల్లే ఆ షోకి వచ్చానని, ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చిందని వివరించింది. తాను ఇంతకుముందు ఏ షోకీ వ్యాఖ్యాతగా వ్యవహరించలేదని చెప్పింది. తనకు తెలుగు సరిగ్గా రాదని, అంతేగాక ఇంతకు ముందు బిగ్‌బాస్‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని తెలిపింది. తన మీద నమ్మకముంచి తనను పోత్సహించినందుకు తన మామకు ధన్యవాదాలు చెప్పింది. ఆ షో చూసి తనపై చాలా ప్రేమ కురిపించిన ప్రేక్షకులకూ ధన్యవాదాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.