తండ్రి కళ్లజోడు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

30-10-2020 Fri 11:22
  • ‘తర్వాత కొనిస్తాలే’ అంటూ చెప్పుకొచ్చిన తండ్రి 
  • ఇంట్లోంచి వెళ్లిపోయి ఉరివేసుకుని చనిపోయిన కుమారుడు
  • మెదక్ జిల్లా అహ్మద్‌నగర్‌ గ్రామంలో ఘటన
youngster commits suicide in medak

తనకు కళ్లజోడు కొనివ్వాలని ఓ యువకుడు తన తండ్రిని అడిగాడు. అయితే, ‘తర్వాత కొనిస్తాలే’ అంటూ తండ్రి చెప్పుకొచ్చాడు. ఆ మాత్రానికే మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలం అహ్మద్‌నగర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు తెలిపారు.  తలారి దుర్గేశ్‌ (20) మేస్త్రీ పని చేస్తుంటాడు. ఇటీవల రాత్రి సమయంలో తన తండ్రి తలారి వెంకటేశ్‌తో మాట్లాడుతూ కళ్లజోడు కావాలని అడిగాడు. తర్వాత ఎప్పుడైనా కొనిస్తానని తండ్రి చెప్పడంతో దుర్గేశ్ గొడవపడ్డాడు. దీంతో అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.‌ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.