సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

30-10-2020 Fri 07:21
  • తమన్నా సినిమా ఆగిపోలేదట!
  • ఇటలీలో ముగిస్తున్న 'రాధే శ్యామ్'
  • అల్లరి నరేశ్ 'నాంది' షూటింగ్ పూర్తి  
Satyadev tells film with Tamanna is not shelved

*  కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' చిత్రాన్ని తమన్నా, సత్యదేవ్ జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఆమధ్య ప్రకటన వచ్చింది. అయితే, ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలొస్తున్న నేపథ్యంలో హీరో సత్యదేవ్ వాటిని ఖండించాడు. అలాంటిదేమీ లేదని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని పేర్కొన్నాడు.
*  ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా ఇటలీలో జరుగుతోంది. ఇప్పటికే చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటితో అక్కడి షెడ్యూలు పూర్తవుతున్నట్టు తెలుస్తోంది.
*  అల్లరి నరేశ్ హీరోగా రూపొందుతున్న 'నాంది' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో నరేశ్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ను పోషించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.