మార్షల్ దీవుల్లో తొలిసారి వెలుగుచూసిన కరోనా.. యూఎస్ మిలటరీ బేస్‌లో ఇద్దరికి సంక్రమణ

30-10-2020 Fri 07:15
  • బాధితులు ఇద్దరూ ఒకే విమానంలో వచ్చిన వైనం
  • వారి ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమించలేదన్న అధికారులు
  • కట్టడికి కొత్తగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వివరణ
corona virus arrives in marshal islands

ఇన్నాళ్లూ కరోనా మహమ్మారికి దూరంగా ఉన్న మార్షల్ ఐలండ్స్‌లో తొలిసారి రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఖ్వజాలిన్ అటోల్ ప్రాంతంలోని యూఎస్ మిలటరీ బేస్‌లో ఇద్దరికి ఈ వైరస్ సంక్రమించింది. ఈ నెల 27న వీరిద్దరూ హవాయి ప్రాంతం నుంచి ఒకే విమానంలో వచ్చినట్టు గుర్తించారు.

అయితే, వీరి ద్వారా ఇతరులకు ఈ వైరస్ సంక్రమించలేదని స్పష్టం చేసిన అధికారులు వైరస్ కట్టడికి కొత్త నిబంధనలు అమలు చేయబోవడం లేదన్నారు. కాగా, చిన్న దేశాలైన సమోవా, టోంగా, నౌరు వంటి దీవులు అత్యంత అప్రమత్తంగా ఉండడంతో ఇప్పటి వరకు ఆ దీవులను వైరస్ తాకలేకపోయింది.