తూర్పుగోదావరిలో దారుణం.. పెళ్లి వ్యాను బోల్తాపడి ఆరుగురి దుర్మరణం

30-10-2020 Fri 06:57
  • గోకవరం మండలం తుంటికొండ ఘాట్‌రోడ్డులో ఘటన
  • వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపై నుంచి కిందపడిన వ్యాన్
  • బాధితులు టాకూర్‌పాలేనికి చెందిన వారిగా గుర్తింపు
6 dead in road accident in East Godavari dist

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో దారుణం జరిగింది. తుంటికొండ ఘాట్‌రోడ్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ తెల్లవారుజామున పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో వ్యాను బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండపై నుంచి కిందపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను మండలంలోని టాకూర్‌పాలేనికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.