టీవీలో కూడా ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమా!

29-10-2020 Thu 21:59
  • స్టార్ హీరోల సినిమాలకు టీవీలో మంచి టీఆర్పీ   
  • బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన 'సాహో'
  • ఇటీవల టీవీలో ప్రసారం అయిన చిత్రం
  • 5.8 టీఆర్పీతో ఆకట్టుకోలేకపోయిన 'సాహో'     
Saho got poor response even on the Tube

ప్రేక్షకాదరణ పొందడంలో కొన్ని సినిమాల లెక్కలు చాలా విచిత్రంగా ఉంటాయి. బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందిన సినిమాలు కూడా టీవీలో ప్రసారం అయితే మాత్రం మంచి ఆదరణ పొందుతాయి. అందులోనూ ఇటీవలే రిలీజైన స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైనా, టీవీ దగ్గరికి వచ్చేసరికి మంచి టీఆర్పీ తెచ్చుకుంటాయి. అయితే, ప్రభాస్ నటించిన ఓ భారీ చిత్రం మాత్రం టీవీలో కూడా ఫెయిల్ అయి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో ఆమధ్య 'సాహో' అనే భారీ చిత్రం వచ్చింది. 'బాహుబలి' తర్వాత రిలీజైన సినిమా కాబట్టి ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా, టీవీలో మంచి ఆదరణ వస్తుందన్న నమ్మకంతో భారీ అంచనాలతో  ఇటీవల ఓ ఛానెల్ లో దీనిని ప్రసారం చేశారు.

అయితే, విచిత్రంగా 5.8 టీఆర్పీ సాధించి టీవీలో కూడా ఇది ఆదరణకు నోచుకోలేదట. ఎంతో ఇమేజ్ వున్న ఒక స్టార్ హీరో నటించిన కొత్త చిత్రానికి ఈ స్థాయి రేటింగ్ రావడం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. చిన్న హీరోలు నటించే సినిమాలకు, రిపీట్ ప్రసారాలకు కూడా మరి కాస్త టీఆర్ఫీ వస్తుందని, 'సాహో'కే ఇలా జరిగిందని అంటున్నారు.