బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి తప్పిన ముప్పు

29-10-2020 Thu 21:03
  • తివారీ హెలికాప్టర్ కు ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు
  • 40 నిమిషాల పాటు ఆందోళన
  • పాట్నా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
BJP MP Manoj Tiwari escaped an unexpected danger

బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోవడంతో తీవ్ర కలకలం రేగింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన మనోజ్ తివారీ పెనుప్రమాదం తప్పించుకున్నారు. తివారీ ఈ ఉదయం పాట్నా ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయన బెట్టియా ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. కానీ, 40 నిమిషాల పాటు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు, ఏటీసీకి మధ్య సంబంధాలు తెగిపోయాయి. దాంతో ఆ హెలికాప్టర్ ఏమైందో తెలియక తీవ్ర ఆందోళన నెలకొంది.

కాగా, బయల్దేరిన కాసేపటికే ఏటీసీ నుంచి సంకేతాలు నిలిచిపోవడంతో పైలట్ కు దారితెలియలేదు. పైలట్ కంగారు పడడం గమనించిన మనోజ్ తివారీతో పాటు ఆయన బృందం హడలిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ పైలట్ మాన్యువల్ బుక్ సాయంతో హెలికాప్టర్ ను ఎలాగోలా తిరిగి పాట్నా తీసుకువచ్చాడు. ఆపై, హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.