Jagan: నవంబర్ 2కు వాయిదా పడ్డ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

  • కేసు విచారణను వేగవంతం చేసిన కోర్టు
  • తమ కేసులపై తొలుత విచారణ జరపాలన్న ఈడీ
  • ఈడీ విచారణను తర్వాత జరపాలన్న జగన్ లాయర్
Jagan case hearing adjourned to Nov 2

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది.

జగన్ తరపున ఆయన లాయర్ విచారణకు హాజరవుతున్నారు. మరోవైపు జగన్ కేసు విచారణను సీబీఐ కోర్టు నవంబర్ 2కు వాయిదా వేసింది. తమ కేసుల విచారణను ముందు చేపట్టాలన్న ఈడీ అభ్యర్థనపై ఈరోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్ మాట్లాడుతూ సీబీఐ కేసు తేలిన తర్వాత లేదా రెండు కేసులను ఒకేసారి విచారించాలని కోర్టును కోరారు. ఈడీ కేసులను ముందు విచారించవద్దని విన్నవించారు.

More Telugu News