Heavy Rains: 'ఈశాన్య' జోరు... చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

  • తమిళనాడును పలకరించిన ఈశాన్య రుతుపవనాలు
  • నిన్న రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షాలు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy rains lashes Chennai city

ఈశాన్య రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా, భారీ వర్షాలను తీసుకువచ్చాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అత్యధిక ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దాంతో చెన్నై వాసుల్లో ఆందోళన నెలకొంది. గతంలో చెన్నైలో వచ్చిన వరదలను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాగా, కొన్నిరోజుల కిందటే దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం షురూ అయింది. నిన్నటితో దేశం నుంచి పూర్తిగా తొలగిపోవడంతో, ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైంది.

More Telugu News