కాజల్ ఇంట ఊపందుకున్న పెళ్లిపనులు... ఫొటోలు ఇవిగో!

29-10-2020 Thu 18:24
  • రేపు కాజల్ పెళ్లి
  • గౌతమ్ కిచ్లూ చేయందుకోబోతున్న కాజల్
  • నేడు కాజల్ నివాసంలో హల్దీ కార్యక్రమం
Haldi ceremony at Kajal Aggarwal house in Mumbai

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబరు 30న పెళ్లి చేసుకోబోతోంది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇంట పెళ్లిపనులు ఊపందుకున్నాయి. ఇవాళ కాజల్ కుటుంబ సభ్యులు పసుపు దంచి పెళ్లిపనులను లాంఛనంగా ప్రారంభించారు. ముంబయిలోని కాజల్ నివాసంలో జరిగిన ఈ హల్దీ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాజల్ కూడా హుషారుగా స్టెప్పులేస్తూ హల్దీ సంప్రదాయాన్ని హాయిగా ఆస్వాదించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.