ఏపీ కరోనా అప్ డేట్: 88,778 టెస్టులు చేస్తే 2,905 మందికి పాజిటివ్

29-10-2020 Thu 17:57
  • అత్యధికంగా పశ్చిమగోదావరిలో 494 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 25 మందికి పాజిటివ్
  • తాజాగా 3,243 మందికి కరోనా నయం
Corona details of Andhra Pradesh state

ఏపీ కరోనా వ్యాప్తికి సంబంధించిన తాజా బులెటిన్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 88,778 కరోనా టెస్టులు నిర్వహించగా 2,905 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 494 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 16 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,659కి పెరిగింది. తాజాగా, 3,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,17,679కి చేరుకుంది. ఇప్పటివరకు 7,84,752 మంది కరోనా విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 26,268 మాత్రమే.