ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

29-10-2020 Thu 17:17
  • నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కవిత
  • కవితతో ప్రమాణస్వీకారం చేయించిన శాసనమండలి చైర్మన్ గుత్తా
  • కవితకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
Kalvakuntla Kavitha has taken oath as MLC

ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఇవాళ పదవీ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా కవితకు మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తనకు ఓటు వేసి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కవిత ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రులు సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.