పునర్నవికి కాబోయే భర్త ఇతనే!

29-10-2020 Thu 17:02
  • త్వరలో పెళ్లిచేసుకోబోతున్న పునర్నవి
  • వరుడి పేరు ఉద్భవ్ రఘునందన్
  • యూట్యూబ్ వీడియోలతో ఉద్భవ్ కు గుర్తింపు
Punarnvai reveals her would be husband

బిగ్ బాస్ రియాల్టీ షోతో ఒక్కసారిగా ఫేమ్ సంపాదించుకున్న సినీ నటి పునర్నవి భూపాలం ఇప్పుడు జీవితంలో మరో దశలో ప్రవేశిస్తోంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిశ్చితార్థపు ఉంగరం చూపించి సోషల్ మీడియాలో అందరిలో ఆసక్తి పెంచిన ఈ బబ్లీ గాళ్ తాజాగా తన చేయందుకోబోతున్న వరుడెవరో చెప్పేసింది. ఈ మేరకు అతడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఇంతకీ పునర్నవి చేసుకోబోయే అబ్బాయి ఎవరో కాదు... అతడి పేరు ఉద్భవ్ రఘునందన్. అతను కూడా ఎంటర్టయిన్ మెంట్ రంగానికి చెందినవాడే. ఉద్భవ్ రఘునందన్ ప్రధానంగా ఓ యూట్యూబర్. అతడికి 'చికాగో సుబ్బారావు' అనే యూట్యూబ్ చానల్ ఉంది. నటుడిగా, రచయితగా, యూట్యూబ్ వీడియో మేకర్ గా ఉద్భవ్ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక, తన కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన పునర్నవి... తామిద్దరం కలిసి రేపు మరిన్ని విషయాలు వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.