Chinmayi: అలాంటి వ్యక్తికి మణిరత్నం పని కల్పించడం బాధాకరం: చిన్మయి అభ్యంతరం

  • వెబ్ సిరీస్ నిర్మిస్తున్న మణిరత్నం
  • తొమ్మిది కథలకు తొమ్మిది మంది దర్శకత్వం
  • సింగర్ కార్తీక్ కు పని కల్పించడంపై చిన్మయి అభ్యంతరం
Singer Chinmayi comments on Maniratnam

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మీటూ ఉద్యమం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండ్రస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ఎందరో చీకటి బతుకులను ఈ ఉద్యమం బహిరంగపరిచింది. పరిశ్రమలోని మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. సింగర్ చిన్మయి సైతం మీటూ ఉద్యమం ద్వారా ప్రకంపనలు పుట్టించింది. ఇప్పటికీ ఆమె మీటూ వ్యవహారాన్ని వదలడం లేదు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నంను కూడా ఆమె తప్పుపట్టింది.

వివరాల్లోకి వెళ్తే మణిరత్నం 'నవరస' అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నారు. తొమ్మిది కథల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి తొమ్మిది మంది దర్శకత్వం వహించనున్నారు. వీరిలో అరవిందస్వామి, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ మీనన్, కేవీ ఆనంద్, రతీంద్రన్ ప్రసాద్, పొన్ రామ్, హలిత షలీమ్, బిజోయ్ నంబియార్ లు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే, సింగర్ కార్తీక్ ఈ సినిమాకు పని చేస్తున్నాడు. అతనిపై మీటూ ఆరోపణలు ఉండటంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై చిన్మయి స్పందిస్తూ... అలాంటి వ్యక్తికి మణిరత్నం పని కల్పించడం బాధాకరమని వ్యాఖ్యానించింది. బాధితులైన తనలాంటి వారు పని లేకుండా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News