Schools: ఏపీలో మళ్లీ తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు... షెడ్యూల్ ఇదిగో!

  • నవంబరు 2న పునఃప్రారంభం
  • దశలవారీగా విద్యా బోధన
  • రోజు విడిచి రోజు తరగతుల నిర్వహణ
  • ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం
AP Schools and Colleges Reopening Schedule released

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించగా, ఆ మేరకు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. అది కూడా ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తారు.

నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. నవంబరు 12 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది. ఇక, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. కరోనా నియమావళికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహణ జరపాల్సి ఉంటుందని షెడ్యూల్ లో పేర్కొన్నారు.

More Telugu News