ప్రియుడు సునీల్ రెడ్డిని పరిచయం చేసిన హీరోయిన్‌ పూనం బజ్వా

29-10-2020 Thu 12:04
  • పలు తెలుగు చిత్రాల్లో నటించిన పూనం బజ్వా
  • ప్రియుడి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమ గురించి వెల్లడించిన పంజాబీ భామ
  • నీతో ప్రతి క్షణం ఓ మ్యాజిక్ లా ఉంటుందని వ్యాఖ్య
Actress Poonam Bajwa in love with Sunil Reddy

తన కెరీర్ ను టాలీవుడ్ తో ప్రారంభించిన హీరోయిన్ పూనం బజ్వా... తన అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత కన్నడ, తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా ఈ పంజాబీ భామ మెరిసింది. నేవీ అధికారి కూతురైన పూనం బజ్వా... ముంబైలో జన్మించింది. బాలీవుడ్ ఛాన్సుల కోసం కొంత మేర ప్రయత్నించినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు. చివరిసారిగా టాలీవుడ్ లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో ఆమె నటించింది. గత ఏడాది రెండు చిత్రాల్లో నటించిన పూనం చేతిలో ఇప్పుడు సినిమాలు లేకపోవడంతో... పెళ్లికి సిద్ధమైంది.

తన ప్రియుడు సునీల్ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి పూనం రెడీ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సునీల్ రెడ్డిని పరిచయం చేసింది. సునీల్ బర్త్ డే సందర్భంగా అతనితో కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేసింది. మంచి హృదయమున్న నా లైఫ్ మేట్, సోల్ మేట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. నీతో ఉండే ప్రతి క్షణం ఓ మ్యాజిక్ లా ఉంటుందని  చెప్పింది. నా రూట్స్, గ్రౌండ్ అంతా నీవేనని అతనిపై ఉన్న ప్రేమను చాటింది.