తన పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో సాయితేజ్!

29-10-2020 Thu 10:50
  • త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదు
  • అమ్మాయిని వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు
  • దీంతో పెళ్లికి  ఓకే చెప్పాను
  • ఈ నేపథ్యంలోనే వివాహంపై వదంతులు‌
sai tej about his marriage

మెగా హీరో సాయితేజ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనది ప్రేమ పెళ్లి అని కొందరు, పెద్దలు కుదిర్చిన వివాహమని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన పెళ్లి ఏ నెలలో జరగనుందన్న విషయంపై కూడా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు రావడం గమనార్హం. అయితే, దీనిపై స్పందించిన సాయితేజ్.. ఆ ప్రచారాన్నంతా కొట్టిపారేశాడు.  

త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని సాయితేజ్ స్పష్టం చేశాడు. తనకు తగిన అమ్మాయిని వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని, దీంతో పెళ్లికి ఓకే చెప్పానని తెలిపాడు.  తన వివాహం గురించి మీడియా అమితాసక్తి చూపుతోందని, ఈ నేపథ్యంలోనే తన వివాహంపై వదంతులు‌ వస్తున్నాయని పేర్కొన్నాడు. కాగా, ఆయన నటించిన  'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మరో సినిమాకు కూడా ఆయన కమిట్ అయ్యారు.