పవన్ కల్యాణ్ కి జోడీగా సాయిపల్లవి?

29-10-2020 Thu 09:08
  • గ్లామరస్ పాత్రలకు సాయిపల్లవి దూరం 
  • 'అయ్యప్పనుమ్ కోషియమ్'లో అవకాశం?
  • సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రం    
Sai Pallavi opposite Pawan Kalyan

సాయిపల్లవి ఇమేజ్ వేరు.. మిగతా హీరోయిన్లలా గ్లామరస్ పాత్రలు చేయదు. ప్రాధాన్యత వున్న పాత్రలే తన హోమ్లీ లుక్ తో చేస్తుంటుంది. అందుకే, ఈ ముద్దుగుమ్మకు ఇంతవరకు స్టార్స్ తో నటించే ఛాన్స్ రాలేదనే చెప్పచ్చు. అలాంటి సాయిపల్లవి త్వరలో పవన్ కల్యాణ్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పవన్ పక్కన కథానాయిక పాత్రకు సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతుందనేది త్వరలో వెల్లడవుతుంది.

ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా 'లవ్ స్టోరీ' చిత్రంలోనూ, 'విరాటపర్వం' చిత్రంలో రానా సరసన, 'శ్యామ్ సింగ రాయ్'లో నాని పక్కన ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తోంది.