సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

29-10-2020 Thu 07:24
  • పారితోషికాన్ని పెంచేసిన పూజ హెగ్డే 
  • జెమినీ టీవీకి పవన్ సినిమా హక్కులు
  • ఫిలిం సిటీలో అలియా నెల రోజుల మకాం  
Pooja Hegde hikes her fee

*  'అల వైకుంఠపురములో' చిత్రం విజయం తర్వాత కథానాయిక పూజ హెగ్డే డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దాంతో ప్రస్తుతం ఈ చిన్నది తన పారితోషికాన్ని బాగా పెంచేసింది, సినిమాకి 2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
*  పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ భారీ రేటుకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో కథానాయిక అలియా భట్ వచ్చే నెలలో జాయిన్ అవుతోంది. హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీలో నెల రోజుల పాటు ఆమె షూటింగ్ పార్టును అక్కడే పూర్తిచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆ నెల రోజులూ ఆమె ఫిలిం సిటీలోనే వుంటుందట.