కొత్త సినిమాలో కాలేజీ లెక్చరర్ గా వెంకటేశ్!

28-10-2020 Wed 20:52
  • వయసుకు తగ్గా పాత్రలు చేస్తున్న వెంకీ 
  • ప్రస్తుతం 'నారప్ప'.. ఆ తర్వాత 'ఎఫ్ 3'
  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా
  • వినోదాత్మకంగా కాలేజీ సన్నివేశాలు
Venkatesh plays college lecturer role

సీనియర్ నటుడు వెంకటేశ్ తన కెరీర్ మొదటి నుంచీ కూడా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వుంటారు. తనకు సూటవుతాయనుకునే పాత్రలనే ఎంచుకుంటూ, వాటిలోనే అభినయం పరంగా కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవలి కాలంలో వయసుకు తగ్గా పాత్రలను.. హుందాగా వుండే పాత్రలను ఆయన ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో త్వరలో ఓ సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రను పోషించడానికి ఆయన రెడీ అవుతున్నారు. 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చక్కని చిత్రాలను రూపొందించి పేరుతెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న 'నారప్ప', 'ఎఫ్ 3' సినిమాల తర్వాత వచ్చే ఏడాది మధ్యలో ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

ఇక ఇందులో వెంకీ కాలేజీ లెక్చరర్ గా సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఆయన లెక్చరర్ గా కనిపించే క్లాస్ రూమ్, కాలేజీ సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా వుంటాయట. హార్స్ రేసెస్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని, ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు నిర్మిస్తారని తెలుస్తోంది.