Punarnavi: నా పెళ్లి ఫిక్స్ అయింది: పునర్నవి

Big Boss contestant Punarnavi announces her marriage
  • చివరకు జరగబోతోంది అని ప్రకటించిన పునర్నవి
  • కాబోయే భర్త చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేసిన వైనం
  • అయితే ఫేస్ ను మాత్రం చూపించకుండా సస్పెన్స్ లో ఉంచిన పునర్నవి
సినీ నటి, బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. 'ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ (చివరకు జరగబోతోంది)' అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు కాబోయే భర్త తన చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో తన ఫియాన్సీ ముఖాన్ని చూపించకుండా, అందరినీ సస్పెన్స్ లో ఉంచింది.

బిగ్ బాస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ నడిచింది. ఇద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఉంటూ జనాల్లో ఆసక్తిని పెంచారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని ప్రేక్షకులు అనుకున్నారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో వీరిద్దరికీ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, తాము స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ  చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పునర్నవి తన పెళ్లి గురించి అనౌన్స్ చేసింది. అయితే వరుడు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.
Punarnavi
Marriage
Tollywood
Bigg Boss

More Telugu News