Raja Singh: సానియా మీర్జానే కాల్పులు జరిపినట్టు గ్రామస్తులు చెపుతున్నారు: రాజా సింగ్

Raja Singh blames Sania Mirza in cow killing case
  • ఫాంహౌస్ లో ఆవును కాల్చి చంపిన వైనం 
  • సానియా ఫాంహౌస్ ఇన్చార్జి అరెస్ట్
  • సానియా నెమలిని చంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయన్న రాజాసింగ్
వికారాబాద్ జిల్లా దామగుండలోని ఫాంహౌస్ లో ఒక ఆవును తుపాకీతో కాల్చిచంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా ఫాంహౌస్ ఇన్చార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేత కోసం వచ్చిన ఆవును నాలుగు రోజుల క్రితం కాల్చి చంపినట్టు ఉమర్ పై ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమర్ కు తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెపుతున్నారని అన్నారు. సానియా గతంలో నెమలిని కూడా చంపిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఆవును చంపిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Raja Singh
Sania Mirza
Cow

More Telugu News