కరోనా బారిన పడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

28-10-2020 Wed 19:53
  • కరోనా సోకినట్టు ప్రకటించిన స్మృతి ఇరానీ
  • టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని ప్రకటన
  • స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్
Smriti Irani tests with Corona Positive

ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమిత్ షా సహా పలువురు క్యాబినెట్ మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనతో టచ్ లోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు. మరోవైపు, స్మృతి త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు.