ఏపీ కరోనా అప్ డేట్స్.. మరో 18 మంది మృతి

28-10-2020 Wed 19:31
  • 24 గంటల్లో 2,949 కొత్త కేసులు
  • 8,14,774కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 26,622
18 more died with Corona with AP

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 2,949 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,774కి చేరుకుంది. మొత్తం 6,643 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గత 24 గంటల్లో 3,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 77,028 మంది కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.