Revanth Reddy: అంతవరకు వస్తే మోదీని కూడా వదలం.. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదు: కేటీఆర్

  • బీజేపీ నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి
  • మేము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నాం
  • త్వరలోనే రేవంత్ బీజేపీలోకి వెళ్తారు
Revanth Reddy is not a leader says KTR

దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది కాబట్టే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తోందని చెప్పారు. సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... లేనిది ఉన్నట్టు చెప్పడం బీజేపీ నేతల అలవాటని విమర్శించారు. తాము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నామని... తమ ఓపిక నశిస్తే ప్రధాని మోదీని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మాట్లాడటం తమకు కూడా వచ్చని అన్నారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు.

హరీశ్ రావు విసిరిన సవాల్ కు ఇంత వరకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రూ. 27 వేల కోట్ల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ ఇప్పుడు  కాంగ్రెస్ లో ఉన్నారని... త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని అన్నారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీ మారుతారని చెప్పారు.

More Telugu News