ఏటీఎం నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితిని పెంచిన ఎస్బీఐ.. ఏ కార్డుకు ఎంత డ్రా చేసుకోవచ్చంటే...!

28-10-2020 Wed 13:42
  • 7 రకాల కార్డులపై పరిమితిని పెంచిన ఎస్బీఐ
  • రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు డ్రా చేసుకునే అవకాశం
  • రూ. 10 వేలకు మించితే మొబైల్ కు ఓటీపీ
SBI increases withdrawal limit for debet cards

తన వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏటీఎంల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడు రకాల డెబిట్ కార్డులపై విత్ డ్రాయల్ లిమిట్ ను పెంచుతున్నామని తెలిపింది. కార్డులను బట్టి రోజుకు రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని... అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.

డెబిట్ కార్డుల వారీగా రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్ వివరాలు:

  • క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు
  • గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు
  • గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు
  • ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష
  • ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు
  • ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు
  • మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు

మరోవైపు రూ. 10 వేలు అంతకు మించి విత్ డ్రా చేసుకునేటప్పుడు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుందని... ఆ ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేయాలని ఎస్పీఐ తెలిపింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే... ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.