sanjay raut: వారికి ఈ దేశంలో వుండే హక్కు లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

  • ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీపై ఆగ్రహం 
  • చైనా సాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామన్నారు
  • అంతర్జాతీయ సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు
  • కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
  • త్రివర్ణ పతాకం ఎగురవేయబోమనే వాళ్లు దేశ ద్రోహులు
sanjay raut slams mufti farooq

ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మెహబూబా ముఫ్తీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు భారతదేశంలో ఉండటానికి హక్కు లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా సాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.  అంతర్జాతీయ సమాజానికి వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు.
 
 ఫరూక్ అబ్దుల్లా,  మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ఇటువంటి నేత‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేయబోమనే వాళ్లు దేశ ద్రోహులని ఆయన వ్యాఖ్యానించారు. తాము దేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లుచేయాల‌ని చాలా కాలం నుంచి కోరుతున్నామ‌ని చెప్పారు.

దీనిపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని, ఒక‌వేళ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లుచేయాల‌నుకుంటే, దానికి మ‌ద్ద‌తిచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా, జమ్మూ క‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ‌కు చైనా స‌హాయం చేస్తుంద‌ని ఫ‌రూక్ అబ్దుల్లా ఇటీవల అన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు మూడురంగుల జెండా ఎగురవేయబోనని ముఫ్తీ అన్నారు.

More Telugu News