kareena kapoor: గర్భిణి అయినప్పటికీ హుషారుగా షూటింగుల్లో పాల్గొంటున్న హీరోయిన్ కరీనా

kareena pic goes viral
  • రెండో బిడ్డకు జన్మనివ్వనున్న కరీనా
  • ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్న అమ్మడు
  • కుర్చీలో కూర్చొని హుషారుగా ఫొటోకు పోజు
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గర్భిణి అన్న విషయం తెలిసిందే. తాను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆగస్టులో ఆమె తన సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా తెలిపింది. గర్భిణి అయినప్పటికీ ఆమె అలాగే షూటింగులకు వెళ్తూ హ్యాపీగా పాల్గొంటోంది.

సాధారణంగా కొందరు హీరోయిన్లు గర్భిణిగా ఉన్న సమయంలో తమ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తపడతారు. కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొంది. అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా ఆమె వెంటే ఉంది. కుర్చీలో కూర్చొని ఆమె హుషారుగా ఫొటోకు పోజులిచ్చింది.   
kareena kapoor
Viral Pics
Viral Videos

More Telugu News