america: బైడెన్‌కే జై కొడుతున్న అమెరికా యువత!

American youth supports joe biden
  • ట్రంప్ కంటే 24 పాయింట్లు ముందున్న బైడెన్
  • 56 శాతం మంది యువత మద్దతు బైడెన్‌కే
  • ఓటు వేస్తామంటున్న 63 శాతం మంది యువత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి యువత ఓటు ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్‌కేనని ఓ సర్వేలో వెల్లడైంది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అధ్యక్ష ఎన్నికలపై యువత అమితాసక్తి  కనబరుస్తున్నట్టు హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. వయసు 18-29 ఏళ్ల మధ్యనున్నవారిపై సర్వే చేయగా, వీరిలో 63 శాతం మంది తాము తప్పకుండా ఓటుహక్కు వినియోగించుకుంటామని తెలిపారు.

2016 ఎన్నికల్లో 47 శాతం మంది యువత మాత్రమే ఓటు వేయగా, ఈసారి అది గణనీయంగా పెరగనున్నట్టు సర్వే పేర్కొంది. మరోవైపు, ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు యువతలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. యువ ఓటర్ల మద్దతు విషయంలో ట్రంప్ కంటే బైడెన్ 24 పాయింట్లు ముందున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం 56 శాతం మంది బైడెన్‌కే జై కొడుతున్నారు.
america
Donald Trump
Joe Biden
youth
presidential elections

More Telugu News