Amitabh Bachchan: కేబీసీలో కంటెస్టెంట్ వేసిన జోకుకి అమితాబ్ ఆగ్రహం

amitab fires on contestent
  • గెలిచిన డబ్బు ఏం చేస్తారని ప్రశ్నించిన బిగ్ బీ
  • 15 ఏళ్లుగా భార్య ముఖాన్ని చూసి విసుగొచ్చిందన్న కంటెస్టెంట్
  • గెలుచుకునే డబ్బుతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని జోక్
  • సరదాకి కూడా ఇలాంటి మాటలు అనకూడదన్న బిగ్ బీ
బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అబితాబ్ బచ్చన్‌‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షోలో తాజాగా ఓ కంటెస్టెంట్ వేసిన జోకుపై బిగ్ బీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షోలో భాగంగా కంటెస్టెంట్‌ను సాధారణంగా పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో గెలిచిన డబ్బు ఏం చేస్తారని ప్రశ్నించారు.

దీనికి కంటెస్టెంట్ స్పందిస్తూ.. 15 ఏళ్లుగా తన భార్య ముఖాన్ని చూసి విసుగొచ్చిందని చెప్పాడు. తాను ఈ షోలో గెలుచుకునే డబ్బుతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని జోక్ వేశాడు. దీంతో సరదాకి కూడా ఇలాంటి మాటలు అనకూడదని బిగ్ బీ అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు సీరియస్‌గా తీసుకోవద్దని ఆ కంటెస్టెంట్ భార్యకు అమితాబ్ బచ్చన్ చెప్పారు. కాగా, ప్రస్తుతం 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షో 12వ సీజన్ కొనసాగుతోంది.
Amitabh Bachchan
Bollywood
kbc

More Telugu News