నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను: సోము వీర్రాజు

28-10-2020 Wed 09:46
  • నన్ను కలిసే సందర్భాల్లో వాటిని తీసుకురావద్దు
  • పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు తీసుకురండి
  • మనం వస్త్రదానం కూడా చేయొచ్చు
  • నిరుపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా
somu veerraju requests party leader

తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు తీసుకురావద్దని, పేదలకు ఉపయోగడే వస్త్రాలు తీసుకురావాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ‘నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను. నన్ను కలిసే సందర్భాల్లో గౌరవార్థంగా తీసుకొచ్చే శాలువాలకు బదులుగా పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు మాత్రమే తీసుకుని రావాల్సిందిగా కోరి ప్రార్ధిస్తున్నాను’ అని ఆయన చెప్పారు.

‘పేదల అవసరాలకు వీలుగా మనం వస్త్రదానం కూడా చేయొచ్చు. నిరూపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా చేసే కార్యక్రమాన్ని నేటితో విరమించుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలందరికీ మనవి. పేదలకు పంచేందుకు వీలుగా ఉండే తువ్వాళ్లు, లుంగీలు, పంచలు లాంటి వస్త్రాలు పేదల సహాయార్థం స్వీకరించబడతాయి’ అని సోము వీర్రాజు చెప్పారు.