'పెళ్లిసందడి'కి హీరోయిన్ ఫైనల్ అయింది!
- రాఘవేంద్రరావు తాజా చిత్రం 'పెళ్లిసందడి'
- హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్
- హీరోయిన్ గా మాళవిక నాయర్ ఎంపిక
ఇక ఇందులో నాటి 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా నటిస్తున్నట్టు మొన్ననే అధికారికంగా ప్రకటించారు. అలాగే తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త కథానాయికను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు.
ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ 'పెళ్లిసందడి' మరెంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి!