కరోనా కారణంగా మారిన శరీర రంగు.. కోలుకున్న తర్వాత తిరిగొచ్చిన ఛాయ!

28-10-2020 Wed 09:43
  • కరోనా రోగులకు చికిత్స అందిస్తూ మహమ్మారి బారినపడిన వైద్యుడు
  • 39 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న వైనం
  • యాంటీబయాటిక్ మందుల కారణంగా నల్లబడిన శరీరం
Wuhan doctor whose skin turned dark due to COVID treatment returning to normal

కరోనా మహమ్మారి బారినపడి శరీర రంగును కోల్పోయిన చైనా వైద్యుడికి కోలుకున్న అనంతరం పూర్వపు రంగు తిరిగి రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వుహాన్‌కు చెందిన యీ ఫాన్ అనే హృద్రోగ నిపుణుడు కరోనా రోగులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న సమయంలో కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది జనవరి 18న ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. 39 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్ మందులు వాడారు. అవి తీసుకున్న తర్వాత ఆయన శరీరం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది

అయితే, చికిత్స అనంతరం మహమ్మారి బారి నుంచి కోలుకున్న తర్వాత పోయిన ఛాయ తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తన శరీరం ఇంతేనని భావించిన ఆయన పూర్వపు రంగు తిరిగి రావడంతో సంతోషం పట్టలేకపోయారు. కోలుకున్న అనంతరం వైద్యుడు యీ ఫాన్ ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకారి అని అందులో పేర్కొన్నారు.